Sunday, April 28, 2024

Ananya: అన‌న్య‌కు మంచి రోజులు…

అనన్య నాగళ్ల అంటే ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. డిస్కషన్స్ లో కూడా చాలానే సినిమాలు ఉన్నట్లు చెబుతున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మొత్తం మారిపోయింది.

మాములుగా తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్ లో అంత ప్రియారిటీ ఉండదు, పెద్దగా అవకాశాలు ఇవ్వరు అంటూ ఉంటారు. కానీ, అనన్యను చూస్తుంటే.. టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటున్నారు. వచ్చిన ఓ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అనన్య ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

- Advertisement -

అందం, అభినయం, అమాయకత్వంతో ఇన్నాళ్లు అలరించింది. ఇప్పుడు తంత్ర సినిమాతో ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించేందుకు రెడీ అయిపోయింది. తాజాగా తంత్ర సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. అంతేకాకుండా అనన్య పేరు కూడా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక వెన్నెల కిషోర్ తో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ కూడా చేస్తేంది. పొట్టేల్ అనే సినిమా కూడా ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. కథాకేళీ అనే మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇలా ఈ తెలుగమ్మాయి టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోవడం మాత్రమే కాకుండా.. ప్రయత్నం, హార్డ్ వర్క్, కృషి ఉంటే అవకాశాలు- సక్సెస్ తప్పకుండా వస్తుంది అంటూ నిరూపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement