Sunday, April 28, 2024

Manchu Laxmi: బ్లూ వేల్ గా మంచు…

టాలీవుడ్ లో హోస్ట్ గా, న‌టిగా, నిర్మాత‌గా ఆల్ రౌండర్ ప్రతిభ‌తో మెప్పించిన లక్ష్మీ మంచు కెరీర్ లో ఎన్నో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. మంచు కుటుంబంలో మేలిమి ప్ర‌తిభ‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. కొంత కాలంగా తాను ముంబైలో నివాసం ఉంటున్నాన‌ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ కొలువుదీరిన చోట‌ సొంతంగా ఒక ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ ఇంటికి అవ‌స‌ర‌మైన ఇంటీరియ‌ర్ డిజైన్ కి సంబంధించిన వీడియోను ఇంత‌కుముందు ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అయింది. త‌న అభిరుచికి త‌గ్గ‌ట్టుగా ఈ ఇంటిని డిజైన్ చేయించడం ఆసక్తిని క‌లిగించింది. . న‌టిగా హిందీ సినిమాలు సిరీస్ ల‌తోను ల‌క్ష్మీ మంచు బిజీ కానున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. . తాజాగా ఇన్‌స్టా వేదిక‌గా ల‌క్ష్మీ ప్ర‌స‌న్న షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఈ ఫోటోషూట్‌లో ల‌క్ష్మీ మంచు పూర్తిగా బ్లూ అండ్ బ్లూ లుక్ లో క‌నిపించారు. షైనింగ్ బ్లూ ఫ్రాక్‌లో ప్ర‌సన్న ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నార‌ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. బ్లూస్‌ని తీసివేయడానికి ఉత్తమ మార్గం? నీలిరంగు ధరించండి.అంటూ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని జోడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement