Saturday, April 27, 2024

స‌ర్కార్ కొలువే ల‌క్ష్యం…

భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు
శిక్షణ కేంద్రాల బాట పడుతున్న యువతి, యువకులు
ఉద్యోగాలకు దీర్ఘకాలిక సెలవులు పెట్టి ప్రిపేర్‌ అవుతున్న సర్కారు ఉద్యోగులు
ఆసక్తి ఉన్న కొలువులను ఎంచుకొని పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇది ఉద్యోగనామ సంవత్సరం. నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చి పెట్టే సంవత్సరం. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ప్రక టించినట్లుగానే గతేడాది చివరలో భారీగా నోటిఫి కేషన్లను వేసింది. గ్రూప్‌-1, 2, 3, 4, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై, స్టాఫ్‌ నర్స్‌, ఎంఏయూడీ, అకౌంట్స్‌, అగ్రికల్చర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఏఎంవీఐ, బీఐఈ, లైబ్రేరియన్‌, జూనియర్‌ లెక్చ రర్లు, హాస్టల్‌ వెల్ఫేర్‌ తదితర నోటిఫికేషన్లు ఇప్పటికే వెలు వడ్డాయి. మరికొన్ని త్వరలో వెలువడనున్నాయి. అయితే ఇందులో గ్రూప్‌-1, పోలీస్‌ ఉద్యోగాల భర్తికి ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిగిలినవాటికి దరఖాస్తు ప్రక్రియ నడుస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలపై యుత దృష్టి సారించింది. ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. ప్రణాళి కలు రూపొందించుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్ర భుత్వ కొలువే లక్ష్యంగా ఏర్పర్చుకున్న గ్రామీణ ప్రాంత యు వత పట్టణాల బాటపడుతున్నారు హైదరాబాద్‌, వరంగల్‌ వంటి పట్టణాల్లో శిక్షణా కేంద్రాల్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది యువతి, యువకులు కోచింగ్‌ కేంద్రాల్లో చేరారు. పోలీస్‌ ఉద్యోగాలు, గ్రూప్‌-2, 3, 4, జూనియర్‌ లెక్చరర్లు తదితర ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే తమ కలల కొలువును సాకారం చేసుకునేందుకు కోచింగ్‌ సెంటర్లకు యువత క్యూ కడుతున్నారు. మరోవైపు ఇప్పటికే సర్కారు కొలువున్న ఉద్యోగులు సైతం గ్రూప్‌-2 లాంటి ఉద్యోగాల కోసం సెలవులు పెట్టి ప్రిపేర్‌ అవుతున్నారు.
రాష్ట్రంలో 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవడంతో, అంతే వేగంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఇతర జిల్లాలకు చెందిన అభ్యర్థులంతా హైదరా బాద్‌లో కోచింగ్‌ తీసుకునేందుకు నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర కొన్ని జిల్లా కేంద్రాల్లోనూ గ్రూప్స్‌, పోలీస్‌, టీచర్స్‌, హెల్త్‌, పంచాయతీరాజ్‌ సెక్రటరీ, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. కానీ హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు ఇచ్చే శిక్షణ ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయంతో వేలాది మంది యువత నగర బాట పడు తున్నారు. ఇక్కడ ఉత్తమ ఫ్యాకల్టి, డైలీ టెస్టుల నిర్వ #హణ, స్టడీ మెటీరియల్‌, హాస్టల్‌ వసతి బాగుంటాయనే కారణాలతో వేలల్లో ఫీజులను చెల్లించి హైదరాబాద్‌ కోచింగ్‌ కేంద్రాల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement