Friday, March 29, 2024

విజువ‌ల్ వండ‌ర్ గా శాకుంత‌లం….వీడియోతో..

టాప్ హీరోయిన్ స‌మంత లీడ్ రోల్ లో న‌టిస్తున్న మూవీ శాకుంత‌లం.. ఈ మూవీకి గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కుడు.. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. ట్రైల‌ర్ లో ఒక వైపున అడవిలో శకుంతల ఆశ్రమవాసం .. మరో వైపున రాజ్యంలో దుష్యంతుడి రాజరికం. ఇద్దరి పరిచయం .. ప్రేమ .. వివాహం .. విరహం .. దుర్వాసుడి శాపం .. భరతుడి జననం వరకూ అద్భుతమైన విజువల్స్ తో చూపారు.. ట్రైల‌ర్ రిచ్ గా ఉండ‌టంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి.. మలయాళ నటుడు దేవ్ మోహన్ , మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ మూవీకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ ట్రైల‌ర్ ను మీరూ వీక్షించండి…

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement