Friday, April 26, 2024

ప్రపంచ మేధావి అంబేద్కర్ – పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ అని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ..భారత దేశం గర్వించదగ్గ మేధావిగా అంబేద్కర్‌ నిలిచారన్నారు. తన మేధస్సుతో దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌లాంటి మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్‌ ఆశయసాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌరులంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్‌ కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముత్యం సునీత రమేష్, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement