Sunday, May 26, 2024

దైవ శాసనం!

ఉపనిషత్తుల సారం దైవశాసనం లాంటిది. అటువంటి వాటిలో ఒక మార్గదర్శన సూచిక తైతిరీయోపనిషత్తులోని శిక్షావల్లి. ఆశ్రమ విద్యలో విద్యార్థి కర్తవ్యాలు పొందుపరచి ఉత్తమ వ్యక్తిగా సమాజంలోకి పంపేవారు. సత్ప్రవర్తనతో సమా జాన్ని నడిపించడానికి కృషి చేయాలని గురువుల ఆకాంక్ష. అటువంటి మహౌన్నత సూత్రాలను మననం చేసుకుందాం.

సత్యం శాశ్వతమైనది, మార్పులేనిది. ఋతం కూడా సత్యమే అయితే ధర్మం కోసం ఒక్కొక్కసారి మారుతుంది. యజ్ఞం, అగ్నిహోత్రం నిర్వహించాలి. అతిథులను ఆదరిం చాలి. మానవ శ్రేయస్సే ధ్యేయంగా పనులు చేప ట్టాలి. ఉత్తమ సంతానాన్ని పొందాలి. వారు కూడా ఉత్తమ సంతానాభివృద్ధి చేయాలి. ఈ విశ్వం మార్పు చెందని ఒక క్రమబద్ధతతో పనిచేస్తోందని గ్రహించాలి. మనం నివసించే భూ మి భ్రమణం, పరిభ్రమణం, ఋతువుల ఏర్పాటు, వర్షం ఇవన్నీ క్రమం తప్పకుండా జరిగే ఋతాలు. వీటి ద్వారా మనకు ప్రకృతి లభించింది. ప్రకృతికి అనుకూలంగా జీవించాలి. లేదంటే ప్రతికూలం తప్పదు. ఎవరికీ హాని చెయ్యనిది ‘సత్యం’. సత్యా న్నే పలకాలి. ప్రియంగా మాట్లాడాలి. సత్యం కాని ప్రియవచనాలను పలుకరాదు. తపస్సు ద్వారా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అంతర్ముఖత అలవాటు చేసుకోవాలి. ఇంద్రియాల వెంట పరు గెత్తరాదు. వ్యాకులమైన మనసు దేనినీ సవ్యంగా విచారణ చేయలేదు. కనుక మనసును ప్రశాంతం గా ఉంచుకోవాలి.
దేవ, ఋషి, పితృ, నర, భూత అను పంచ యాగముల ద్వారా ఈ లోకం నుండి మనం పొం దినవి తిరిగి పంచివేయాలి. వీటి మూలంగా జీవజాలంతో, తల్లిదండ్రులతో, తోటి మానవుల తో, ప్రకృతితో కలసిమెలసి జీవించిన వారమవుతు న్నాం. నిత్యాగ్నిహోత్రుడై ఉండాలి. దైవారాధన, నిత్య దీపం కలిగి ఉండాలి.
‘అతిథిదేవోభవ:’ అతిథి భగవంతునితో సమానముగా భావించి ఆదరించాలి. తనకు ఉప యోగపడే పనులను ఎలా చేపడతారో అలాగే లోకానికి మేలు చేసే పనులను చేపట్టాలి. ఒక ఉత్త మ గృహస్థుగా నిలిచి వంశాభివృద్ధిని చేయాలి. ఈవిధంగా గొప్ప మౌలిక సూత్రాలను నేర్పి విద్యా ర్థిని జీవితసౌరభాన్ని ఆస్వాదించమనిపంపేవారు. ఈ జీవన విద్యతో లక్ష్యసాధన చేయాలి. లక్ష్య సాధనలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్వయం సూచనా ప్రతిపత్తితో ముందుకు సాగాలి. సంసార మనే మహావృక్షానికి వేరువంటివాడిని, పర్వత శిఖరంలాంటి ఘనత నాది, సూర్యునివలే నేనూ అమరుడను, ఆధ్యాత్మిక సంపదకు వారసుడును, చైతన్య జాగృతి కలిగినవాడను, దీప్తిమంతుడను అని స్వయం ఉద్దీపన చేసుకుని లక్ష్యాన్ని చేరుకోవా లి. ధర్మమార్గంలో నడవాలి, విద్యను చేజార్చుకో కూడదు. విద్యను లోకకళ్యాణం కొరకు మాత్రమే ఉపయోగించాలి. గురువులకు గురుదక్షిణ సమ ర్పించాలి. సంతతి పరంపరను విచ్ఛిన్నం చేయ కూడదు. సత్యాన్నుండి వైదొలగకూడదు. మేలు కలిగించే వాటిని చేపట్టండి. నేర్చుకోవడం, నేర్ప డం నుండి నిష్క్రమించకండి. దేవతలకు, పితరు లకు చేయవలసిన కర్తవ్యాల నుండి తప్పుకోకండి. తల్లిదండ్రులను దైవంగా పూజించండి. ఆచార్యు ని, అతిథిని దైవంగా ఆదరించండి. నింద్యరహిత మైన కార్యాలనే చేపట్టండి.
ఉన్నతులు, పునీతులైనవారు, పెద్దలు వచ్చిన పుడు లేచి నిలబడి వారికి ఆసనం చూపించి, వారి శ్రమను తొలగించే ఉపచర్యలు చేయాలి. శ్రద్ధతో దానం చేయాలి. ఉదాసీనంగా దానం చెయ్యకూడ దు. శక్తిని మించి దానం చెయ్యకూడదు. సహృద యంతో, వినమ్రంగా, సగౌరవంగా దానం చెయ్యా లి. దానం వలన ధన్యత దాతకే లభిస్తుంది. అది దానం తీసుకున్నవారి వలన లభిస్తుంది. ఈ లోకం లో ఎవరూ ఒకరి మీద ఆధారపడి లేరు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఈ ప్రకృతిలో జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. అపాత్ర దానం చెయ్యకూడదు. దానగ్రహీత అవసరం, ఉపయోగం తెలుసుకున్న తరువాతనే దానం చెయ్యాలి.
దీనినే భగవానుడు సత్త్వగుణ విశిష్టత, జ్ఞాన యోగనిష్ఠ, నిర్భయత్వము, దానము, ఇంద్రియ నిగ్రహము, భగవదారాధన, స్వాధ్యాయము, తప స్సు, ఋజుత్వము, అహింస, సత్యము, అక్రోధ ము, స్వార్థ త్యాగము, శమము, ఉపరతి, చిత్త శాంతి, దోషారోపణ చేయకుండుట, భూతదయ, విషయాసక్తి లేకుండుట, మృదుత్వము, అణకువ, చిత్త చాంచల్యము లేకుండుట, తేజస్సు, క్షమ, ధైర్య ము, బాహ్యాంతరంగిక శుద్ధి, ద్రోహము చేయకుం డుట, దురభిమానము లేకుండుట సదా అనుసర ణీయములని వారే దైవీసంపద కల వారని, వారికి జన్మరాహిత్యము తథ్యమని శాసిం చినాడు. తైత్తిరీయోపనిషత్తు కూడా ఇదే ఆదేశం, ఉప దేశం, దేవరహస్యం, దైవాజ్ఞ, ఈవిధంగానే చేయా లి, ఈవిధంగా చేయబడాలి అని ఒక దైవశాసనంగా ముగిస్తుంది. విద్యార్థులను ఈవిధంగా సుశిక్షితు లను చేస్తే సుఖశాంతులు వర్థిల్లడం తథ్యం.
– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement