Thursday, May 30, 2024

మహిళల కామన్వెల్త్‌ గేమ్స్‌.. జులై 31న భారత్‌-పాకిస్తాన్‌ మళ్లి ఢీ..

ముంబై : క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌… భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జులై 31న క్రికెట్‌ మ్యాచ్‌ జరుగనుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా భారత మహిళా క్రికెట్‌ జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. యూకేలో బర్మింగ్‌హామ్‌ వేదికగా మ్యాచ్‌ జరుగనుంది. ఇక, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తాజాగా జట్టును ప్రకటించింది. పాకిస్థాన్ మహిళల జట్టుకు బిస్మా మరూఫ్‌ నాయకత్వం వహించనుంది. టీ20 సిరీస్‌లో శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేసిన జట్టునే ఎంపిక చేయడం విశేషం.
24 సంవత్సరాల తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోకి క్రికెట్‌ తిరిగి వచ్చేసింది. ఈసారి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి.

సుదీర్ఘకాలం తర్వాత క్రికెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం మహిళా జట్లే పోటీపడతాయి. ఈ లీగ్‌ కమ్‌ నాకౌట్‌ ఉమెన్స్‌ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌.. జులై 29న భారత్‌-ఆస్ట్రేలియా జరుగనుంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కోసం ఆస్ట్రేలియా, బార్బడోస్‌, ఇంగ్లండ్‌, ఇండియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ జట్లు ఇప్పటికే అర్హత సాధించగా తాజాగా శ్రీలంక జట్టు కూడా అర్హత సాధించింది. దీంతో టోర్నీలో పాల్గొనబోయే జట్ల సంఖ్య 8కి పెరిగింది. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎలో బార్బడోస్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇండియా జట్లు ఉండగా, గ్రూప్‌-బీలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement