Wednesday, May 8, 2024

రానున్న మూడు రోజులు భగ భగలే..

అమరావతి, ఆంధ్రప్రభ: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఎండలు మండనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం అల్లూరిసీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు,ఎన్టీఆర్‌, కృష్ణా,గుంటూరు,పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 46 సెంటీగ్రేడ్‌ 47 డిగ్రీల ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం,విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని, విశాఖపట్నం, వైఎస్సార్‌, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి,నంద్యాల, కర్నూలు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

ఈనెల 4వ తేదీ శనివారం … అల్లూరిసీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, పార్వతీపురంమన్యం, విజయనగరం, కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం,తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య,అనంతపురం, శ్రీసత్యసాయి,నంద్యాల,కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది..

5వ తేదీ ఆదివారం …. అల్లూరిసీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి -46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, కాకినాడ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్‌, అన్నమయ్య,అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని,

శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ బి.ఆర్‌ఒ అంబేద్కర్‌ తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్‌ కాకుండా ఉండటానికి క్షా (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌), ఇంట్లో తయారుచేసుకునే పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు త్రాగాలి,వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement