Monday, May 6, 2024

టాటా క్రోమాలో శీతాకాలపు ఆఫర్లు

టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా స్టోర్లతో పాటు, వెబ్‌ సైట్‌లో శీతాకాలపు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. డిసెంబర్‌ 8న ప్రారంభమైన ఆకర్షణీయమైన డీల్స్‌లో ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, బ్లూ టూత్‌ స్పీకర్లు, ఏసీలు, పవర్‌ బ్యాంక్‌లు, ఎయిర్‌ ప్యూరిఫైయిర్లు, ఇయర్‌ ఫోన్లుపై పలు ఆఫర్లు లభిస్తాయని సంస్థ తెలిపింది. బ్యాక్‌ ఫ్యాక్‌లపై 70 శాతం, ఇయర్‌ ఫోన్స్‌పై 80 శాతం తగ్గింపు ఇస్తున్నారు.

డీఎస్‌ఎల్‌ఆర్‌, ఎంఎల్‌ కెమెరాల కొనుగోలుపైనా, లెక్సార్‌ మొమరీ కార్డులపై 10 శాతం రాయితీ ఇస్తున్నారు. ట్రావెల్‌ బ్యాగ్‌లపై 5 శాతం రాయితీ లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపింది. గీజర్లు 799 రూపాయల నుంచి ఎయిర్‌ పూరిఫైయిర్లు 7599 రూపాయల నుంచి లభిస్తాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement