Friday, April 26, 2024

టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో 100 యాపిల్‌ స్టోర్లు

టాటా గ్రూప్‌కు చెందిన ఇన్ఫినిటీ రిటైల్‌ దేశంలో వంద యాపిల్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఈ స్టోర్లలో కేవలం యాపిల్‌ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తారు. ఈ మేరకు ఇన్ఫినిటీతో యాపిల్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇన్ఫినిటీ ఇప్పటికే క్రోమా పేరుతో ఎలక్ట్రానిక్‌ వస్తువులు అమ్మే రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తోంది. టాటాకు చెందిన హోసూర్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌లో యాపిల్‌ ఐ ఫోన్‌కు చెందిన కంపోనెంట్స్‌ను తయారు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం యాపిల్‌ ఫ్రాంచైజీ భాగస్వామిగా టాటా గ్రూప్‌ మారుతుంది. దేశవ్యాప్తంగా వంద రిటైల్‌ స్టోర్స్‌ను ఇన్ఫినిటీ ఏర్పాటు చేయనుంది. ఇవి రీసెల్లర్‌ కేంద్రాలుగా కూడా పని చేయనున్నాయి. యాపిల్‌ కంపెనీ ఇప్పటికే మన దేశంలో ప్రీమియం రీసెల్లర్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది.


టాటా గ్రూప్‌ ఇన్ఫినిటీ ప్రారంభించనున్న ఈ కేంద్రాల్లో యాపిల్‌ ఐప్యాడ్‌లు, ఐఫోన్లు, యాపిల్‌ వాచ్‌లు విక్రయిస్తారు.
రికార్ట్‌ స్థాయిలో ఎగుమతులు మన దేశం నుంచి ఐ ఫోన్‌ ఎగుమతులు రికార్డ్‌ స్థాయిలో జరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలంలో మన దేశం నుంచి 20 వేల కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలతో దీన్ని సాధించారు. మన దేశంలో యాపిల్‌ ఐ ఫోన్ల కాంట్రాక్ట్‌ తయారీ సంస్థలు ఉన్నాయి. చైనాలో కోవిడ్‌ మూలంగా తలెత్తిన ఇబ్బందులతో ఫ్యాక్స్‌కాన్‌ కంపెనీలు ఉత్పత్తికి అటాంకాలు ఎదురవుతున్నాయి. దీంతో మన దేశంలో కంపెనీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంది. మన దేశం నుంచి ఈ స్థాయిలో ఐఫోన్ల ఎగుమతులు జరగడం ఇదే మొదటిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement