Sunday, May 12, 2024

రేపటి మీ తీర్పు కోసం ఎదురుచూస్తున్నా.. సమంత

రేపటి మీ తీర్పు కోసం తాను ఎదురుచూస్తున్నానని తెలిపింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. తన సుదీర్థ సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమయినటువంటి పాత్రలను సమంత పోషించింది. గ్లామర్ పాత్రలనే కాకుండా, మహిళా ప్రాధాన్యత ఉన్న ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభినందనలను అందుకుంది. ఆమె తాజా చిత్రం ‘యశోద’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఎంతో ఉత్కంఠగా ఉన్నానని సామ్ తెలిపింది. ఇంకొక్క రోజు మాత్రమే ఉందని చెప్పింది. మీ అందరికీ ‘యశోద’ నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నానని తెలిపింది. ఈ సినిమాకోసం నా మాదిరే ఎదురు చూస్తున్న నా దర్శకులు, నిర్మాతలు, తారాగణం, మొత్తం సిబ్బందికి శుభాకాంక్షలు చెపుతున్నానని ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement