Tuesday, May 7, 2024

‘విరూపాక్ష’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

సాయి ధరమ్ తేజ్, సంయుక్త జంటగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష. ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబ‌డుతునే ఉంది. SVCC బ్యానర్‌పై తెర‌కెక్కించిన ఈ మూవీకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.

- Advertisement -

అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఇదే నెల‌ మే 21న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి OTT ప్లాట్‌ఫారమ్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సునీల్, సోనియా సింగ్, అభినవ్ గోమతం, శ్యామల, బ్రహ్మాజీ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement