Thursday, May 16, 2024

Cabinet: సీఎం స‌ల‌హాదారుడిగా వేం న‌రేంద‌ర్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేంనరేందర్‌ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆయనతోపాటు మరో ఇద్దరిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ నియామకం అయ్యారు. దేవిధంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు. వీరందరికి కేబినెట్‌ హోదా కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement