Saturday, April 27, 2024

వడివసాల్ మూవీ ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘వడివసాల్‌’ ఒకటి. యాక్షన్‌ థ్రిల్లర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై చిత్ర నిర్మాత స్పందించాడు. షూటింగ్‌ ఆగిపోయిందంటూ వస్తున్న రూమర్స్‌పై నిర్మాత కలైపులి ఎస్‌.థాను తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని, ఫేమ్‌ పొందేందుకే కొందరు అలాంటి వదంతులు వ్యాప్తి చేస్తుంటారన్నారు.

అభిమానులు వాటిని నమ్మవద్దని థాను కోరారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉందని పేర్కొన్నారు. యాక్షన్ థిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వీ క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జీ.వి ప్ర‌కాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా ఆండ్రియా జెరేమియా న‌టిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫుటేజ్ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement