Monday, May 6, 2024

మెదక్‌ జిల్లాలో చిరుత సంచారం కలకలం

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అటుగా వెళుతున్న రైతులకు పొలాల్లో చిరుత కనిపించింది. భయాందోళనకు గురైన రైతులు పరుగులు తీశారు. వెంటనే ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. చిరుతను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదలాలని కోరారు. అధికారులు మాట్లాడుతూ.. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని, స్థానిక గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం సమయంలో ఒంటరిగా బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. పులి సంచరిస్తున్న పరిశరాలను పరిశీలిస్తామని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement