Saturday, April 27, 2024

వీ.. అంతర్జాతీయ రోమింగ్‌ ప్యాక్‌.. 24 గంటలకు రూ.599

అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మరింత మంది భారతీయుల వ్యాపార, విశ్రాంత ప్రయాణాల కోసం సిద్ధం అవుతున్నారు. భారతదేశపు సుప్రసిద్ధ టెలికామ్‌ ఆపరేటర్‌ వీ… అత్యంత ఆకర్షణీయమైన అంతర్జాతీయ రోమింగ్‌ ప్యాక్‌లను ఈ హాలిడే సీజన్‌లో తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. పలు దేశాల్లో ఆపరేటర్లతో వీకు భాగస్వామ్యం ఒప్పందాలు ఉండటంతో.. వీ వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతర్జాతీయ ప్రయాణాలు చేసుకోవచ్చు.

అపరిమిత వాయిస్‌ కాల్స్‌..

వీ అంతర్జాతీయ రోమింగ్‌ ప్యాక్‌లతో వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అపరిమిత వాయిస్‌ కాల్స్‌, డేటాను తమ సాటిలేని రోమింగ్‌ నెట్‌వర్క్‌పై అంతర్జాతీయంగా పొందొచ్చు. వీ పోస్టు పెయిడ్‌ వినియోగదారులు అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యాపార, విశ్రాంత కేంద్రాలైనటువంటి యూఏఈ, యూకే, యూఎస్‌ఏ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, బ్రెజిల్‌ వంటి ఎన్నో ప్రాంతాలను సందర్శించొచ్చు. ఈ ప్రాంతాలను సందర్శించిన వినియోగదారులు రూ.599 ప్యాక్‌ను 24 గంటల వ్యాలిడిటీతో పొందొచ్చు. రూ.5999 ప్యాక్‌తో 28 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అదనంగా వ్యక్తిగత, ఫ్యామిలీ ప్లాన్‌ (ప్రైమరీ సభ్యులు) కలిగిన రెడ్‌ఎక్స్‌ వినియోగదారులు ప్రతీ సంవత్సరం ఓ అంతర్జాతీయ ట్రిప్‌ను రూ.2999 కలిగిన వీ అంతర్జాతీయ రోమింగ్‌ ప్యాక్‌ను ఆస్వాదించొచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement