Tuesday, May 18, 2021

వీర జవానులకు అమిత్ షా నివాళి..

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో న‌క్స‌ల్స్ దాడిలో అమ‌రులైన జ‌వాన్ల‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళుల‌ర్పించారు. జ‌వాన్ల పార్థివదేహాల వ‌ద్ద పుష్పాంజ‌లి ఘ‌టించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జ‌గ‌ద‌ల్‌పూర్‌లో 14 మంది అమ‌ర జ‌వాన్ల మృత‌దేహాల‌ను ఉంచారు. అయితే న‌క్స‌ల్స్ దాడిలో మొత్తం 24 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోగా, ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది జ‌వాన్ల మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. జ‌వాన్ల‌పై దాడి జ‌రిగిన ప్రాంతాన్ని మ‌రికాసేప‌ట్లో అమిత్ షా ప‌రిశీలించ‌నున్నారు. బీజాపూర్ – సుక్మా జిల్లాల స‌రిహ‌ద్దును ప‌రిశీలించి, స‌మీక్ష చేయ‌నున్నారు. చికిత్స పొందుతున్న జ‌వాన్ల‌ను అమిత్ షా ప‌రామ‌ర్శించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News