Saturday, April 27, 2024

సుధీర్ బాబు హంట్ మూవీకి.. యూ/ఏ సర్టిఫికెట్

హంట్ మూవీ సెన్సార్ ని పూర్తి చేసుకుంది. మహేష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ హీరో భరత్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శమిస్తున్నారు. దానికి తగ్గట్టుకుని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత భరత్ సినిమా లో విలన్ పాత్రలో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించబోతున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే రోజు రిలీజ్ కాబోతోంది. తాజా హంట్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ని కేటాయించారు. యాక్షన్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు సుధీర్ బాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement