Wednesday, May 8, 2024

TRAIN: సిగ్న‌ల్ ప‌డ్డ ఆగ‌ని రైలు… త‌ప్పిన ప్ర‌మాదం…

రైల్వే స్టేష‌న్‌లో రైలు ఆగి ఉన్న స‌మ‌యంలో సిగ్న‌ల్ ప‌డ్డ ఆగ‌కుండా మ‌రో రైలు దూసుకొచ్చింది. ఇది గ‌మ‌నించిన రైల్వే అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. దీంతో రైలు ఆగ‌డంతో ప్ర‌యాణీకులంతా పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో ఊపీరి పీల్చుకున్నారు. ఈఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఇట‌వా జిల్లాలో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలాఉన్నాయి.. ఢిల్లీ-హౌరా మార్గంలో భర్ధనా స్టేషన్‌లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉంది. దీంతో దానికి ముందు స్టేషన్‌లో రెడ్ సిగ్నల్ పడింది. అదే సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న శివగంగ ఎక్స్‌ప్రెస్ రైలు లోకోపైలట్లు రెడ్ సిగ్నల్‌ను విస్మరించి రైలును పోనిచ్చారు. రెడ్ సిగ్నల్ పడినా రైలు ముందుకు వెళ్తుండడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రైలు ఆగిపోయింది. అప్పటికే అది కిలోమీటరు దూరం దూసుకెళ్లింది.

రైలు ఆగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తం కాకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు లోకోపైలట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంచు కారణంగా సిగ్నల్ కనిపించకపోయి ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ లోకోపైలట్లు ఎందుకు అప్రమత్తంగా లేరన్న కోణంలో విచారిస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement