Saturday, May 4, 2024

ఇక‌ టిఎంసి, సిపిఐ,ఎన్సీపిలు ప్రాంతీయ పార్టీలు – ఆప్ కి జాతీయ హోదా..

న్యూఢిల్లీ – తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, ఎన్సీపీ పార్టీలకు జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి శుభవార్త చెప్పింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కి జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది .వాస్తవానికి ఓ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే లోక్‌సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లైనా వచ్చి ఉండాలి. నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. లేదంటే దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాల్లో విజయం సాధించి ఉండాలి. ఈ రెండుశాతం సీట్లు కూడా మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నా జాతీయ పార్టీగా గుర్తిస్తారు. అయితే జాతీయ హోదా క‌లిగిన మూడు పార్టీలు ఎన్నిక‌ల‌లో హోదాకు అవ‌స‌ర‌మైన సీట్లు, ఓట్లు తెచ్చుకోక‌పోవ‌డంతో జాతీయ హోదాను రద్దు చేస్తున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.

ఇక 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ మొదట ఢిల్లీలో మాత్రమే పోటీ చేస్తూ తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఐదు సీట్లు గెలిచింది. ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్నది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 6.8 శాతం ఓట్లు ఓట్లు దక్కాయి. అదే సమయంలో ఇద్దరు అభ్యర్థులు సైతం గెలుపొందారు. ఈ క్రమంలో పార్టీకి జాతీయ హోదా ల‌భించింది. ఇది ఇలా ఉంటే అలాగే ఆరు పార్టీల స్టేటస్‌ను మార్పు చేసింది. ఇందులో పీడీఏ (మణిపూర్‌), పీఎంకే (పుదుచ్చేరి), ఎఆర్‌ఎలడీ (ఉత్తరప్రదేశ్), బీఆర్‌ఎస్‌ (ఆంధ్రప్రదేశ్), ఆర్‌ఎస్‌పీ (పశ్చిమ బెంగాల్) ఎంపీసీ (మిజోరాం) ల రీజినల్ పార్టీ స్టేటస్‌ను ఉపసంహరించుకుంది. ఆయా పార్టీలు రిజిస్టర్డ్‌ అన్‌ రికగ్నైజ్డ్‌ పొలిటికల్‌ పార్టీలుగా కొనసాగనున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోటీ చేయనందున రాష్ట్ర హోదాను ఉపసంహరించుకున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement