Friday, May 3, 2024

Delhi | వాలంటీర్లు వార్తాపత్రికల కొనుగోలు పిటిషన్‌పై విచారణ వాయిదా..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గ్రామ వాలంటీర్లు వార్తా పత్రికల కొనుగోలు అంశంపై తీసుకొచ్చిన జీవోను సవాల్ చేస్తూ ఈనాడు (ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్) దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. జీవోను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో ఈనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ. 200 గరిష్ట పరిమితి విధించడంతో కేవలం సాక్షి పత్రిక కొనేలా చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వ సొమ్మును సీఎం తన సొంత పత్రిక వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు.

గ్రామ వాలంటీర్లను ఆయన పార్టీ కార్యకర్తలుగా అభివర్ణించారు. న్యూస్ పేపర్లకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించేలా ఏం చేస్తారని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. న్యూస్ పేపర్ అలవెన్సును రూ. 200 నుంచి రూ. 210గా పెంచవచ్చని, తద్వారా ఆ పరిధిలో అన్ని పత్రికలు కవర్ అవుతాయని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వైద్యనాథన్ సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement