Saturday, April 27, 2024

ఉత్తరమెరికాలో 1 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో.. తునివు

హెచ్ వినోద్ తెర‌కెక్కించిన చిత్రం తునివు..తెలుగులో తెగింపు టైటిల్ తో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో స్టార్ హీరో అజిత్ న‌టించాడు.ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. తునివు చిత్రాన్ని జీస్టూడియోస్‌-బోనీకపూర్ సమర్పణలో బోనీక‌పూర్ నిర్మించారు. మంజు వారియర్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. సంజయ్‌ దత్‌, సముద్రఖని, మహానంది శంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళనాడులో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న తునివు ఓవర్సీస్‌లో కూడా తనదైన ట్రెండీ టాక్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. నార్త్‌ అమెరికా రీజియన్‌ (ఉత్తరమెరికా)లో ప్రతిష్టాత్మక 1 మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరిపోయింది తునివు. అజిత్‌ కుమార్‌ కెరీర్‌లోనే ఇలాంటి అరుదైన రికార్డు నెలకొల్పిన తొలి సినిమాగా తునివు నిలిచింది. సాధారణంగా అజిత్‌ సినిమాలకు ఉత్తరమెరికా ప్రాంతంలో అంతగా బిజినెస్‌ ఉండదు. కానీ తునివు ఎవరూ ఊహించని విధంగా అరుదైన మార్క్‌ను చేరుకుని వార్తల్లో నిలిచింది. విజయవంతంగా ప్రదర్శించబడుతూ మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను చేరుకున్న సందర్భాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు అజిత్‌ అభిమానులు, ఫాలోవర్లు. రానున్న రోజుల్లో తునివు ఇంకెన్ని రికార్డులు సృష్టించబోతుందో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement