Wednesday, May 19, 2021

విజయవాడలో దారుణం.. తల్లి, ఇద్దరు పిల్లల హత్య

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలోని వాంబే కాలనీ-డీ బ్లాక్‌లో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. రక్తపు మడుగులో పడి ఉన్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను నీలవేణి (26), ఝాన్సీ(5), సాయి రేవంత్ (7)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతురాలి భర్త మోహన్‌ వారిని హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News