Monday, May 17, 2021

పూనమ్ కౌర్ వివాదాస్ప ట్వీట్…నిన్ను క్షమించే లేకపోతున్న కాపీ మాస్టర్ !!

పూనమ్ కౌర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా ట్వీట్ చేసిన ప్రతి సారి ఓ హింట్ నిర్వహిస్తూ ఉంటారు. అలానే గతంలో స్టార్ డైరెక్టర్, గురూజీ అంటూ ఏకంగా పరిచయం చేశారు. కానీ ఈ సారి మాత్రం ఎక్కడా హింట్ ఇవ్వలేదు. కానీ కాపీ అనే పదాన్ని ఎక్కువగా వాడారు. దీనితో కాపీ అనే పదం త్రివిక్రమ్ గురించి వాడారు అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

ఇక ట్వీట్ విషయానికి వస్తే… ఐడియాలను కాపీ చేస్తారు. మరో వ్యక్తికి వ్యక్తిత్వాన్ని, ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంటారు. అతను నా డ్రీమ్స్ కాదు. కానీ నా ఐడియాలనులాగేసుకున్నాడు. నిన్ను క్షమించే లేక పోతున్నా కాపీ మాస్టర్. అదెంతో కష్టమైన పని. నువ్ అన్నింటిని కాపీ చేశావ్.. ఐడియాలు, లైఫ్ స్టైల్ అన్నింటిని కాపీ చేశావ్.. నీకు ఎక్కడైతే లాభం వస్తుందో అక్కడ వాడేసుకున్నావ్ అంటూ ట్వీట్ చేసింది పూనమ్.

Advertisement

తాజా వార్తలు

Prabha News