Friday, May 24, 2024

ఈ వారం ఓటీటీలో.. చిన్న సినిమాల హ‌వా

ఓటీటీలో ఈ వారం చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాగా ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాలికాపురం సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఉన్ని ముకుందన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మలయాళంలో మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. 17వ తేదీ నుంచి ‘కల్యాణం కమనీయం’ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై నుంచి పలకరించనుంది. ‘ఆహా’లో ఈ సినిమా స్ట్రీమింగ్ జరగనుంది. సంతోష్ శోభన్ – గెహనా సిప్పీ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్ల నుంచి అంతగా రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. ఇక అదే రోజున సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ సినిమా ‘ఆహా’తో పాటు అమెజాన్ ప్రైమ్ లోను స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ‘వీరసింహారెడ్డి’ .. 27వ తేదీ నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అందుకు సంబంధించిన ట్రైలర్స్ కూడా సందడి చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement