Thursday, May 30, 2024

స్వామికి మహాలక్ష్మి అనుగ్రహం!

‘ష డ్‌ లక్ష్ములు’గా అవతరించిన లక్ష్మీదేవి మూడవ అవతారం మహాలక్ష్మీ స్వరూపం.
వైకుంఠం నుంచి వచ్చిన లక్షీదేవి కొల్హాపూర్‌లో వెలిశా రు. అక్కడకు దేవశిల్పి విశ్వకర్మ వచ్చి, ”మణిద్వీపం” ఎలాగుంటుందో ఆ ఆకారంలోనే ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ అలయంలోనే అమ్మవారు కొలు వై వున్నారు. అమ్మవారు లేక వైకుంఠం కళా వి#హనంగా మారింది. దాంతో స్వామివారు అక్కడుండలేక భూమిపైకొచ్చేశారు. ఈ లోగా త్రేతాయుగం నుండి భూమిపై నున్న వేదలక్ష్మి ఆనే శక్తి ఆకాశరాజు అనే రాజుకు భూమిని దున్నుతుంటే పద్మం లో దొరికింది. కనుక పద్మావతీదేవి అని పేరు పెట్టారు. ఈ తల్లి వేంకటేశ్వరస్వామి ని పెళ్లిచేసుకుంది. పెళ్లికి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు చేశారంటే, స్వామివారి దగ్గ ర శక్తి లేదు. అమ్మ వారు వెళ్లిపోయిందిగా! అం దుకే అప్పు చేయవలసి వచ్చింది. సరే! పెళ్ళైన కొన్ని నెలలు సంతోషంగా ఉన్నారు. కానీ, పద్మావతీ దేవి లక్ష్మీదేవి యొక్క అంశారూపం అంతే! అమ్మవారి పూర్ణా వతారం మాత్రం కొల్హాపూర్‌లో ఉన్నారు. కనుక ఆ లక్ష్మి లేకపోతే ఆయనెలా పూర్తి సంతోషంగా ఉండగలరు? ఆయన #హృద యంలో కొలువుండాల్సిన లక్ష్మి కదా ఆవిడ! దాంతో ”దేవీ! నువ్విక్కడే తిరుమల కొండపైన వకుళమాత ఆశ్రమంలో ఉండు, నేనెళ్లి లక్షీదేవిని తీసుకొస్తాను” అని చెప్పి, పద్మావతీదేవి దగ్గర అనుమతి తీసుకుని అమ్మ వార్ని వెతుకుతూ కొల్హాపూర్‌ వెళ్లారు. విచిత్రమేమంటంటే, ఆ మణిద్వీపం లాంటి ఆలయంలో దేవతలంతా కనిపించారు కానీ, అక్కడే కొలువై ఉన్న అమ్మవారు కనిపించలేదు స్వామికి. స్వామివారు అలిగి వెళ్లిపోయిన తన భార్యను ప్రసన్నంచేసుకోడా నికి అక్కడి తీర్థాల్లో స్నానంచేసి 10 ఏళ్లపాటు అక్కడే తపస్సు చేశారు. కానీ, అమ్మవారు ప్రత్యక్షం కాలేదు. ”ఏమిటీ? నా భార్య నన్ననుగ్ర#హంచట్లేదు!?” అని శ్రీవారికి ఏమీ అర్థంకాలేదు. అప్పుడు ఆకాశవాణి ”స్వామీ! మీరిక్కడ ఎంతగా తపస్సు చేసినా, అమ్మవారు మీ కు కనిపించరు. ఎందుకంటే, ఇక్కడ రాక్షసుల్ని సం#హరించడానికి రజోగుణ ప్రధానమైన స్వరూపంలో వచ్చింది ఆ తల్లి. (అందుకే చూడండీ! కొల్హాపూర్‌లో అమ్మవారు చేతుల్లో ”గద, పాన పాత్ర, సిం#హవా#హన” అన్నీ ఉంటాయిగా) అందుకే అమ్మ ఇప్పుడు మీకు కనిపించదు స్వామీ! శుద్ధ సత్వ రూపంలోనే మీకు కనిపిస్తుంది. మీతో ఆ స్వరూ పం రావాలంటే మీరు శుకమ#హర్షి ఆశ్రమాని కెళ్లి అక్కడే ఒక సరోవరాన్ని తవ్వి, అందులో దేవ లోకంనుండి తెచ్చిన కమలాలను ప్రతిష్ట చెయ్యండి. అలా 12 ఏళ్లపాటు ఆ కమలా లు వాడిపోకుండా చూడండి. అప్పటి వర కూ అమ్మవార్ని ధ్యానిస్తూ తపస్సు చెయ్యండి. అప్పుడు శుద్దసాత్విక స్వ రూపంతో కార్తీక పంచమి రోజు అమ్మ వారుద్భవిస్తారు, అప్పుడే ఆ తల్లి మిమ్మ ల్ని చేరుకుంటుంది” అని ఆకాశవాణి పలికింది. స్వామి వెంటనే శుకమ#హర్షి ఆశ్రమానికెళ్లారు. ఇంతకూ అమ్మవారు కొల్హా పూర్‌లో రాక్షస సంహారం కోసం వెలి శారు కనుకే ప్రతీ ఏడూ దుర్గాష్టమి రోజు తిరుమల నుండి కొల్హాపూర్‌కు అమ్మవారికి ‘సారె’ వస్తుంది.
పద్మావతీదేవి ”స్వామి నన్నొదిలేసి వెళ్ళిపో యారు” అని బాధపడుతోంది. ”నువ్వు భాదపడక మ్మా! నువ్వు సామాన్యురాలివికాదు. తపస్సు చెయ్యి, చేస్తే వెంటనే నీభర్త నిన్ను చేర తారు” అని వకుళమాత చెప్పింది. వెంటనే పద్మావతీదేవి వెంకటాచలంపైన తపస్సుకు కూర్చుంది. లక్ష్మీదేవి ఏమో కొల్హాపూర్‌లో, శ్రీశుఖపురంలో స్వామివారు.. ఇలా ముగ్గురూ 3 చోట్ల ఉన్నారు. స్వామి తనచేత్తో అక్కడ సరోవరం తవ్వారు. వాయుదేవుడితో దేవలోకం నుండి సర్ణకమలాలు తెప్పించి, సరోవరంలో ఉంచి, సూర్యభగవాను డ్ని పిలిచి ”నువ్వు ఇక్కడ కొలువుండు” అని ఆదేశించారు. ఎందుకంటే సూర్య రశ్మికి కమలాలు వాడిపోవు కనుక. అప్పుడు సరస్సు మధ్యలో అమ్మవార్ని శుద్ధసత్వస్వరూ పంగా భావిస్తూ ‘మహాలక్ష్మీ మూలమంత్రం’ జపి స్తూ, 12 ఏళ్లు తపస్సుచేశారు. చూడండీ! అక్కడ 10 ఏళ్లు, ఇక్కడ 12 ఏళ్లు, మొత్తం 22 ఏళ్లు స్వామివారు తన భార్యను తిరిగిపొంద డానికి నిర్విరామమైన తపస్సుచేశారు. బ్ర హ్మాండాన్నే శాసించే అఖిలాండ కోటి బ్రహ్మాం డనాయకుడు తన బార్యకోసం ఘోరతపస్సు చేశారు. దాంతో దేవతలు, మునులంతా పద్మస రోవరం చుట్టూ ఆకాశం లో చేరి, ”అమ్మా! నువ్వు రా తల్లిd! నువ్వురా తల్లిd!” అంటూ ప్రార్దనల్ని తీవ్ర తరంచేశారు. అలా 12 వ ఏట కార్తీకమాసం, పంచమి రోజు రానేవచ్చింది. స్వామి అలాగే కళ్లు మూసుకుని తపస్సు లో ఉన్నారు. దేవతలకేమో ఆత్రుతగా ఉంది ”అమ్మవారొస్తారా? రా రా?” అని. అప్పుడు భృగుమ#హర్షి అమ్మవారి దగ్గరకెళ్లి ”తల్లిd! నాకు కళ్లు మూసుకుపోయి, నీస్థానాన్ని కాలుతో తన్నాను, నన్ను క్షమించు తల్లిd” అని వేడుకున్నాడు. అంత అమ్మవారు ప్రసన్నమై, కార్తీకశుద్ధ పంచమి రోజు శుద్దసత్వస్వరూపంతో అక్కడున్న పద్మసరోవ రం మధ్యనున్న కమలంలో ఆవిర్భవించింది ఆ తల్లి. ఒంటినిండా తళతళలాడే నగలు, దేదీప్యమాన మైన ముఖం, తెల్లటి వస్త్రాలు ధరించి, దిగ్గజాలు అభిషేకం చేసేస్తున్నాయి. ఆకాశంనుండి పుష్పవర్షం కురుస్తోంది. స్వామివారు కళ్లుతెరిచి చూసారు. అంతే, అమ్మవారిని సంతోషంతో ఆలింగనం చేసుకుని, తన మెడలోని హారాన్ని అమ్మవారి మెడలోవేశారు. దేవతలంతా అమ్మవార్ని ప్రార్థించా రు. అందరూ ”నువ్విక్కడే కొలువై ఉండు తల్లిd!” అని వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement