Sunday, June 9, 2024

Formation day : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అవతరణ వేడుకలకు ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జూన్ 2న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలను ఆదేశించారు.

సీఎం ముందుగా గన్ పార్క్ ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారన్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement