Wednesday, May 29, 2024

Chandina Chaudhary’s యేవమ్ టీజర్ రిలీజ్…

ఇటీవల గామి సినిమాతో హిట్ కొట్టిన చాందిని… త్వరలో ‘యేవమ్’ అనే థ్రిల్లిర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా టీజర్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌.

YouTube video

వికారాబాద్ లో వరుసగా జరుగుతున్న హత్యలు, అక్కడ పోలీస్ గా జాయిన్ అయిన చాందిని ఏం చేసింది అనే ఆసక్తికర థ్రిల్లింగ్ అంశంతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement