Thursday, July 25, 2024

TG Logo – రాష్ట్ర కొత్త లోగో రూప‌క‌ల్ప‌న‌పై రేవంత్ స‌మీక్ష‌….

కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం 12 నమూనాలు తయారు చేయించారు. ఈ విషయమై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు.

ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళా తోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు స‌మాచారం. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగులను కొనసాగిస్తూనే.. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచించారు. రెండ్రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పులను సూచించారు. దానికి అనుగుణం చేసిన తుది రూపంపై సీఎం చేసిన సమీక్షలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement