Friday, June 14, 2024

AI | దూరదర్శన్‌లోకి ఏఐ యాంకర్లు వచ్చేశారు..

రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానెల్ “డిడి కిసాన్” మే 26తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా దూరదర్శన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. న్యూస్ రీడింగ్ కోసం ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్ ఇదే అవుతుంది.

ఈ యాంకర్లు ఏఐ కనెక్టెడ్ కంప్యూటర్లని… ఇవి కూడా మనుషుల్లాగే పనిచేస్తాయని డీడీ కిసాన్ తెలిపారు. ఈ ఏఐ యాంకర్లు వ్యవసాయ రంగ పరిశోధనలు, మార్కెట్‌లో ధరలు, ప్రభుత్వ పథకాలు… అలాగే వాతావరణ సమస్యలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందజేస్తారని.. ఈ ఏఐ యాంకర్లు 50 భాషల్లో మాట్లాడగలరని డీడీ కిసాన్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement