Friday, June 14, 2024

Tripti Dimri: చిరు ద‌ర‌హ‌సంతో….

సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందడానికి సమయం పట్టడం సహజమే. కొన్ని సార్లు సరైన పాత్ర దొరికే వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇక త్రిప్తి దిమ్రి అదే తరహాలో కాస్త ఆలస్యంగా క్రేజ్ అందుకుంది. ఆమెకు ఇటీవల విడుదలైన ‘యానిమల్’ సినిమాలో జోయా పాత్ర ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన్న ఉన్నప్పటికీ, త్రిప్తి తన రెండు సీన్స్ తోనే ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది.

త్రిప్తి దీమ్రీ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదిస్తోంది. రోజురోజుకూ ఆమెకు ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వైపుల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఆమె గ్లామర్ ఫోటోషూట్స్ యువతను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఆమె ప్రముఖ బీచ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

- Advertisement -

అలా గాలికి ఎగురుతున్న కురులు, ఆమె హావభావాలు వీడియోలో మరింత హైలెట్ గా నిలిచాయి. ఇక ఆమె సింపుల్ డ్రెస్సింగ్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక అంతకుముందు త్రిప్తి బికినీ ఫోటోషూట్ లో కూడా మెరిసింది. కానీ ఈ కొత్త ఫోటోషూట్ లో ఆమె మరింత అందంగా కనిపించింది. నెటిజన్లు ఆమె ఫోటోలకు పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement