Saturday, June 8, 2024

Qualifier 2 | డూ ఆర్ డై మ్యాచ్‌.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న రాజస్థాన్..

ఆసక్తికరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ ను కన్ఫామ్ చేసుకుంది. కాగా, కోల్‌కతాతో ఫైనల్‌ ఆడేందుకు నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెన్నై వేదికగా ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుని… హైదరాబాద్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

జట్ల వివరాలు :

రాజస్థాన్ రాయల్స్ :

యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ :

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, జయదేవ్ ఉనద్కత్.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్:

SRH: గ్లెన్ ఫిలిప్స్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే.

RR: షిమ్రాన్ హెట్మేయర్, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్, శుభమ్ దూబే, నాంద్రే బర్గర్.

ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఇదే స్టేడియం వేదికగా జరిగే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ఫైనల్లో కేకేఆర్‌తో ఐపీఎల్‌ ట్రోఫీ కోసం పోటీ పడుతుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఎలిమినేటర్‌లో ఆర్సీబీపై విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌లో అడుగు పెట్టింది. మరోవైపు క్వాలిఫైయర్‌-1లో కోల్‌కతా చేతిలో కంగుతిన్న సన్‌రైజర్స్‌ ఇప్పుడు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement