Friday, January 27, 2023

సెలెక్టర్ల పదవి కోసం దరఖాస్తు చేసుకుంది వీరే..

బీసీసీఐ పురుష సీనియర్‌ జట్టు సెలెక్టర్ల పదవి కోసం దరఖాస్తు చేసుకొనే గడువు సోమవారంతో ముగిసింది. ఐదు పోస్టుల కోసం దాదాపు 50 మందికి పైగా దరఖాస్తు చేసుకొన్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 మందికి పైగా దరఖాస్తు చేసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో మాజీ లెప్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ మనీందర్‌ సింగ్‌, మాజీ ఓపెనర్‌ శివ సుందర్‌ దాస్‌, వినోద్‌ కాంబ్లే ఉన్నారు. దరఖాస్తు దారుల్లో అందరికీ సుపరిచితులైన వారు వీరే. ఇక మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అగార్కర్‌ దరఖాస్తు చేశాడో లేదో మాత్రం తెలియరాలేదు.

- Advertisement -
   

ముంబయి జోన్‌ నుంచి కాంబ్లేతో పాటు సీనియర్‌ ముంబై ప్రస్తుత చైర్మన్‌ సలీల్‌ అంకోలా, మాజీ వికెట్‌ కీపర్‌ సమిర్‌ దరఖాస్తు చేసుకున్నారు. అయితే 50 మందిలో మనీందర్‌ సింగ్‌ (35 టెస్టులు, 59 వన్డేలు), ఎస్‌ ఎస్‌ దాస్‌ ( 21 టెస్టులు, 4 వన్డేలు) మాత్రమే అందరికంటే ఎక్కువ టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడటం గమనార్హం.

తర్వాత వినోద్‌ కాంబ్లే (17 టెస్ట్‌లు, 104 వన్డేలు) ఉన్నాడు. మనీందర్‌ సింగ్‌ 2021లోనూ దరఖాస్తు చేసుకోగా.. ముఖాముఖిలో అర్హత సాధించలేకపోయాడు. మదన్‌లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ) చేతన్‌ శర్మ వైపు మొగ్గు చూపింది. చేతన్‌, మనిందర్‌ ఒకే కాలంలో క్రికెట్‌ ఆడిన ఆటగాళ్లు. ఈ సారి సెలెక్టర్‌ పదవి కోసం దరఖాస్తు చేసినట్లు మనిందర్‌ ఖరారు చేశాడు. దక్షిణ జోన్‌ నుంచి హైదరాబాద్‌ మాజీ స్పిన్నర్‌ కున్వాల్‌ జీత్‌ సింగ్‌ దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారులకు సంబంధిం చిన పూర్తి వివరాలు బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement