Friday, January 27, 2023

భూగర్భ జలవనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను వేస్తోంది. తాజాగా మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది. భూగర్భ జలవనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 57 పోస్టుల్లో 32 గెజిటెడ్‌, 25 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.

- Advertisement -
   

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్‌ 6 నుంచి 27వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. తదితర వివరాల కోసం టీఎసీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే మరోవైపు ఆర్థికశాఖ అనుమతులు ఇస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement