Saturday, May 27, 2023

IPL | ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యే స్టార్ ప్లేయర్స్ వీరే!

మరో వారంలో ఐపీఎల్ 16 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ముమ్మర సాధనలో మునిగిపోయాయి. 16వ సీజన్ మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 31న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే అభిమానుల ఉత్సాహం పుష్కలంగా ఉన్నప్పటికీ, గాయాల కారణంగా చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఈ సీజన్‌కు దూరం కానున్నారు.

2023 ODI ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాబోయే IPL సీజన్ నుండి తొలగించబడ్డాడు. గత ఏడాది డిసెంబర్ 31న జరిగిన తన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలతో బయట పడిన రిషబ్ పంత్, రీసెంట్ గా హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యి.. ప్రస్తుతం గాయాల నుండి కోలుకుంటున్నాడు.

- Advertisement -
   

అదే సమయంలో, కైల్ జేమ్మీసన్ కూడా వెన్నునొప్పితో బాద పడుతున్నాడు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ కూడా గాయం కారణంగా IPL 2023 నుండి తప్పుకున్నాడు. జే.రిచర్డ్‌సన్‌కు ఇటీవల కాలుకి గాయం కారణంగా చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో అతను ఐపిఎల్ నుండి వైదొలగవలసి వచ్చింది.

గోల్ఫ్ ఆడుతున్నప్పుడు గాయం కారణంగా జానీ బెయిర్‌స్టో గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఆటకు దూరంగా ఉన్నాడు. అతనికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) ఇంకా మెడికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. IPL 2023లో అన్రిచ్ నార్ట్జే గురించి ఇంకా కన్ఫార్మేషన్ రాలుదు. అదే సమయంలో, భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గవ టెస్టుకు దూరమయ్యాడు. అతనిపై కూడా BCCI ఇంకా మెడికల్ అప్‌డేట్ ఇవ్వలేదు. గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ 2023కి దూరం కావచ్చని కూడా తెలుస్తోంది. వీరితో పాటు ప్రసిద్ధ్ క్రిష్ణ, మొహిసిన్ ఖాన్, ముఖేష్ చౌదరి తదితరులు గాయాలతో బాధపడుతున్నారు

IPL 2023 నుండి తొలగించబడిన ఆటగాళ్ల జాబితా

  1. జస్ప్రీత్ బుమ్రా (MI)
  2. రిషబ్ పంత్ (DC)
  3. కైల్ జేమిసన్ (CSK)
  4. ప్రసిద్ధ్ కృష్ణ (RR)
  5. విల్ జాక్స్ (RCB)
  6. జే రిచర్డ్‌సన్ (MI)

కన్ఫార్మ్ కాని ఆటగాళ్ల జాబితా..

  1. అన్రిచ్ నోర్ట్జే (DC)
  2. శ్రేయాస్ అయ్యర్ (KKR)
  3. జానీ బెయిర్‌స్టో (PBKS)
  4. సర్ఫరాజ్ ఖాన్ (DC)
Advertisement

తాజా వార్తలు

Advertisement