Saturday, April 27, 2024

ఫలితాల వెల్లడిలో జాప్యంపై అనుమానాలున్నాయి : ఈటల రాజేంద‌ర్

మునుగోడు ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఇప్ప‌టికే బీజేపీ పార్టీ ఫ‌లితాల ఆల‌స్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా ఫ‌లితాల జాప్యంపై ప్ర‌శ్నించింది. ఇదిలా ఉంటే తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ కూడా స్పందించారు. శామీర్ పేటలోని తన నివాసంలో ఈట‌ల‌ మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతుండడంపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. పోలింగ్ ముగిసినా టీఆర్ఎస్ నేతలు మునుగోడులోనే ఉన్నారని వెల్లడించారు. ఒక‌వేళ టీఆర్ఎస్ ఓడిపోతే మునుగోడుకు సంక్షేమ ప‌థ‌కాలు ఆగిపోతాయ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోపించారు. టీఆర్ఎస్ నాయ‌కులంతా పాల‌న ప‌క్క‌న పెట్టి మునుగోడులో ఎందుకు తిష్ట‌వేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలింగ్ సిబ్బందిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఈటల తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement