Saturday, April 27, 2024

స్విగ్గీలో ప్లాట్‌ఫామ్‌ ఫీజు.. రెండు రూపాయల చొప్పున వసూలు

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆదాయాన్ని పెంచుకునేందుకు పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా వచ్చే ఆర్డర్ల నుంచి ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. విలువతో సంబంధం లేకుండా ఆర్డర్‌పై 2 రూపాయల చొప్పున ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలు చేయనుంది. ప్రస్తుతానికి ఫుడ్‌ ఆర్డర్స్‌కు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే వసూలు చేస్తోంది. స్విగ్గీ ఇన్‌స్టామార్క్‌లో ఇచ్చే ఆర్డర్లకు ఈ ఫీజు వసూలు చేయడంలేదు.

ప్లాట్‌ఫామ్‌ ఫీజును హైదరాబాద్‌, బెంగళూర్‌ వంటి నగరాల్లో ఫుడ్‌ డెలివరీలకు ఛార్జీలు వసూలు చేస్తున్నది. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లోనూ ఫుడ్‌ ఆర్డర్లకు ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలు చేయనుంది. దీంతో పాటు ఇన్‌స్టామార్ట్‌ ఆర్డర్లకు కూడా ఈ ఫీజు వసూలు చేయాలని స్విగ్గీ భావిస్తోంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొంతమేర ఈ ఫీజు ఉపయోగపడుతుందని సి ్వగ్గీ ప్రతినిధి ఒరు తెలిపారు. యాప్‌ను ఉపయోగించిన్పుడు ఆ ప్లాట్‌ఫామ్‌కు చెల్లించే ఫీజు ఇది. 2రూపాయలు చిన్న మొత్తమే అయినప్పటికీ, స్విగ్గీలో ప్రస్తతం రోజుకు 15 లక్షల వరకు ఫుడ్‌ డెలివరీలు చేస్తోంది. ఈ లెక్కన స్విగ్గీకి ప్లాట్‌ఫామ్‌ ఫీజు మూలంగా భారీగానే ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ కోసం నియామకాలు..

- Advertisement -

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సేవల కోసం ఈ సంవత్సరం 10 వేల మంది సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోనుంది. ఇందు కోసం ఉద్యోగులు, వృత్తి నిపుణుల నెట్‌వర్కింగ్‌ సంస్థ అప్నాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ నియామకాలు ఉంటాయని స్విగ్గీ తెలిపింది. ఈ నగరాల్లో డెలివరీ సిబ్బందిని పెంచుకోవడం ద్వారా మరింత మార్కెట్‌ వాటాను సాధించాలని సంస్థ భావిస్తోంది. స్విగ్గీలో నిత్యావసరాలను డెలివరీ చేసే ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టామార్ట్‌. గ్రోసరీస్‌ విభాగంలో మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు స్విగ్గీ కొన్ని రోజులుగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement