Sunday, April 28, 2024

Operation Kaveri | సూడాన్​ నుంచి స్వదేశానికి.. 31 మంది తెలంగాణ వాసుల రాక!

సుడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తీవ్ర కలహాలతో అట్టుడుకుతున్న ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం రెస్క్యూ మిషన్​ (ఆపరేషన్​ కావేరీ)ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిన్న, ఇవ్వాల తెలంగాణకు చెందిన చాలామంది ఆపరేషన్​ కావేరీ ద్వారా తిరిగి వస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​ , ఆంధ్రప్రభ

కలహాలతో అట్టుడుకుతున్న సూడాన్‌లో చిక్కుకున్న 31 మంది తెలంగాణ వాసులు ఇప్పటివరకు స్వదేశానికి చేరుకున్నారని శుక్రవారం అధికారిక వర్గాలు తెలిపాయి. సూడాన్ నుండి భారతీయులను తరలించే ఆపరేషన్ కావేరీలో భాగంగా 17 మంది ఢిల్లీలోని పాలం ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో దిగినట్లు సమాచారం. వీరికి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ స్వాగతం పలికారు.

అంతేకాకుండా  నిన్న (గురువారం) మరో 14 మంది ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నారు. న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో ప్రత్యేక హెల్ప్ లైన్ కౌంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా చాలామందిని హైదరాబాద్​తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కూడా కొంతమందికి తాత్కాలిక వసతి కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement