Sunday, May 5, 2024

ఫిజియోథెరపీ పేరుతో మహిళా అథ్లెట్లపై కోచ్ లైంగిక దాడులు..

అథ్లెట్లు గాయాలపాలవడం సహజం..అయితే వారు గాయపడినప్పుడు అదొక అవకాశంగా తీసుకుని వారికి ‘ఫిజియో థెరపీ’ పేరిట లైంగిక వాంఛ తీర్చుకునేవాడట తమిళనాడుకు చెందిన ఓ కీచక కోచ్.. ఫిట్ నెస్ పేరుతో మహిళా అథ్లెట్ లపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడు క్రీడా విభాగం కోచ్ పి. నాగరాజన్ (59) పై లైంగిక దాడుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిజియోథెరపీ చేస్తాను, ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది” అంటూ తమపై లైంగికదాడికి పాల్పడేవాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తనకు ‘సహకారం’ అందించకపోతే పెద్ద ఈవెంట్లలో పాల్గొనలేరని బెదిరింపులకు దిగేవాడని వారు తెలియజేశారు.

ఇటీవల ఓ మహిళా అథ్లెట్ తనపై కోచ్ నాగరాజన్ గత కొన్నేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా, మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు తమపైనా నాగరాజన్ దారుణాలకు పాల్పడ్డాడంటూ ముందుకు వచ్చారు.ఇటీవల ఫిర్యాదు చేసినవారిని ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:కేటీఆర్.. నువ్వే కొత్త బిచ్చగాడివి: మధు యాష్కి

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement