Monday, April 29, 2024

సీఎం కేసీఆర్ కు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ లేఖ

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో తొలగించిన స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1600 కుటుంబాలను రోడ్డున పడేశారని తెలిపారు. క‌రోనా విజృంభించిన వేళ ప్రాణాల‌ను సైతం పణంగా పెట్టి క‌రోనా రోగుల‌కు 24 గంట‌ల పాటు సేవ‌లు అందించిన కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్ న‌ర్సుల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డం హేయ‌మైన చ‌ర్య‌ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.  ప్రగతి భవన్ ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక… కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే కేవలం 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏమిటని నిలదీశారు. ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలని రేవంత్‌రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు.

కాగా, తెలంగాణలో ఉద్యోగం నుంచి తొలగించబడిన కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్‌ న‌ర్సులు శనివారం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని కలిసారు. తొల‌గించిన స్టాప్ న‌ర్సుల‌ను తిరిగి డ్యూటీలోకి తీసుకునే విధంగా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటూ ఈ సందర్భంగా వారు రేవంత్ రెడ్డికి విన‌తి ప‌త్రం అందజేశారు. ఉద్యోగం కోల్పోయిన నర్సులకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని వారికి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: సాగర్ లో ఆగిన విద్యుదుత్పత్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement