Tuesday, March 26, 2024

సాగర్ లో ఆగిన విద్యుదుత్పత్తి

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. నాగార్జున సాగర్ లో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని నిలిపివేసింది. జూన్ 29న అక్కడ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన జెన్ కో.. 30 మిలియన్ (3 కోట్ల) యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసింది. 11 రోజుల పాటు అది నిరాటంకంగా సాగింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేయడం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. అన్ని ప్రాజెక్టుల వద్ద రెండు రాష్ట్రాలు పోటాపోటీగా బలగాలను మోహరించాయి. ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉన్నా కూడా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని లేఖలు రాసింది. అయితే, తెలంగాణ అవసరాల కోసం తమకున్న హక్కులు, నిబంధనల మేరకే జల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుపైనా రెండు రాష్ట్రాలూ పోటాపోటీగా బోర్డుకు లేఖలు రాశాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 50 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

Advertisement

తాజా వార్తలు

Advertisement