Tuesday, May 14, 2024

ఓటీటీ యాప్ స్టార్ట్ చేయబోతున్న సీనియర్ నటి

నటి నమిత గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నమిత 2017 లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నమిత. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… టిటిడి దేవస్థానం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. టిటిడి సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని ఆరోపించారు.

అలాగే తాను నటించిన బౌ బౌ చిత్రం షూటింగ్ పూర్తయిందని త్వరలోనే రిలీజ్ కాబోతోందన్నారు. అంతే కాకుండా థియేటర్ పేరుతో ఓటీటీ, నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు నమిత. ఇక నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహ సినిమాలలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement