Monday, May 20, 2024

Chhattisgarh: బాంబు పేలి ఇద్దరు బాలురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నదికి ఆవలి ఒడ్సపర బోడ్గా గ్రామంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బైరామ్‌గఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇంద్రావతి నది ఒడ్డునున్న బేడంగా గ్రామ సమీప పొలాల్లో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ పొరపాటున అక్కడ ఉన్న ఐఈడీ బాంబులను తాకారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడ్గా గ్రామంలో పేలుడు సంభవించిందని, బాధితుల బంధువులు, గ్రామస్తుల మృతదేహాలను సోమవారం భైరంగఢ్‌కు తీసుకువచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సైనికులను లక్ష్యంగా చేసుకునేందుకు మావోయిస్టులు మందుపాతర అమర్చారని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఆదివారం చిన్నారులు టెండు ఆకులు సేకరిస్తుండగా మందుపాతర పేలింది. దీంతో బొడ్గా గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఓయం(13), బోటి ఓయం(11) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తమ వెంట తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. భైరం గఢ్ పోలీస్ స్టేషన్ గ్రామస్తులను సంప్రదించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement