Wednesday, May 1, 2024

t20 world cup: ఆస్ట్రేలియా జట్టు ఇదే..

టీ 20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. యూఏఈ, ఒమన్‌లో జరగనున్న ఈ వరల్డ్ కప్ టోర్నీ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 14న ముగియనుంది. ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్స్ ఆటగాళ్లతో కలిపి టి20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే మొత్తం 15 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. టీ20 స్పెషలిస్టులుగా పేరున్న మార్కస్ స్టొయినిస్, కేన్ రిచర్డ్‌సన్ కూడా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. వన్డే ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో ఐసిసి మెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్స్‌లో సక్సెస్‌ఫుల్ టీమ్ అనిపించుకున్న ఆస్ట్రేలియా 2007లో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెల్చుకోలేదు.

ఆస్ట్రేలియా జట్టు:

ఆరోన్ ఫించ్ (కెప్టేన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, జోష్ హాజెల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వీప్సన్, మాథ్యూ వేడ్ , డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్ ఆటగాళ్ల జాబితాలో డాన్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డేనియల్ సామ్స్ ఉన్నారు.

ఇది కూడా చదవండి: పాతబస్తీలో బీబీకా ఆలంను సందర్శించిన షర్మిల..

Advertisement

తాజా వార్తలు

Advertisement