Tuesday, May 14, 2024

సినీరంగ మహిళలపై వేధింపులు అరికట్టేందుకు సబ్‌ కమిటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సినిమా, టెలివిజన్‌ రంగంలో పనిచేస్తున్న మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది. శుక్రవారం సబ్‌ కమిటీ తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరవింద్‌ కుమార్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించింది.

ఈ కమిటీ రూపొందించే నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ సమావేశంలో సబ్‌ కమిటీ సభ్యులు వసుధా నాగరాజు, సునీత, ప్రీతి నిగం, సత్యవతి, సుమిత్ర, టిఎస్‌ఎఫ్‌డిసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిషోర్‌ బాబు, పోలీసు, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement