Sunday, May 5, 2024

స్టార్ హీరోపై చీటింగ్ కేసు

కోలీవుడ్ స్టార్ ఆర్య వివాదంలో చిక్కుకున్నాడు. ఆయ‌న‌పై చీటింగ్ కేసు న‌మోదైంది. ఆర్య త‌న‌ను మోసం చేశాడంటూ ఆయ‌న‌పై శ్రీలంక‌కు చెందిన ఓ యువ‌తి కేసు పెట్ట‌డం హాట్ టాపిక్‌గా మారింది. యువ‌తి చేస్తున్న ఆరోప‌ణ‌లు న‌మ్మ‌శ‌క్యంగా లేకున్నా.. త‌న వ‌ద్ద సాక్ష్యాలు ఉన్నాయ‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ‌కరోనా లాక్‌డౌన్‌తో క‌ష్టాల్లో ఉన్నాన‌ని చెప్పి.. ఆర్య త‌న ద‌గ్గ‌ర నుంచి రూ. 70 ల‌క్ష‌లు తీసుకున్నాడ‌ని యువ‌తి ఆరోపించింది. తన‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మాట ఇచ్చి.. ఇప్పుడు కాద‌ని మోసం చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది.


ఆర్య‌కు తాను పంపిన డ‌బ్బు లావాదేవీల వివ‌రాలు, ఆయ‌న‌తో మ‌ట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయ‌ని యువతి చెబుతోంది. అంతే కాదు ఆర్య‌‌కు ముందస్తు బెయిల్ ఇవ్వ‌కుండా స‌ద‌రు యువ‌తి ప్రధాని, త‌మిళ‌నాడు సీఎం పళనిస్వామి, హోం మినిస్టర్ ఆఫీసుల‌కు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసుపై ఏప్రిల్ 4న కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement