Wednesday, May 22, 2024

శ్రీలంక దుస్థితి ఏపీకి పట్టనుంది – టిడిపి నేత బుద్దా వెంకన్న

వన్ టౌన్ (ప్రభన్యూస్): ఇటీవల శ్రీలంకలో ఎదురైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. విజయవాడ పాతబస్తీలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 27, 28 తేదీలలో ఒంగోలులో నిర్వహించ తలపెట్టిన టిడిపి మహానాడు సభలను వైసీపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందన్న కారణంతో బుద్ధా వెంకన్న ప్రభుత్వ తీరుపై ఘాటైన విమర్శలు గుప్పిస్తూ మండి పడ్డారు. ప్రజల్లో చంద్రబాబునాయుడుకు వస్తున్న ఆదరణ చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెమటలు పడుతున్నాయి అన్నారు. ఒంగోలులో టిడిపి మహానాడు సభలను అడ్డుకుంటే రాష్ట్ర రాజధాని అయిన విజయవాడ నుంచే ప్రజా ఉద్యమం లేవనెత్తుతామని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతుంటే…. అధికారులు మాత్రం సీఎం జగన్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో ఓడిపోతానన్న భయంతో జగన్ మోహన్ రెడ్డి ప్ర స్టేషన్ లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement