Friday, April 26, 2024

ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు : మంత్రి హరీష్ రావు

కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ తో కలసి మంత్రి హరీష్ రావు మహిళ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒక మంచి కార్యక్రమం మన కరీంనగర్ లో ప్రారంభించుకున్నామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా అనే కార్యక్రమం ప్రారంభించుకున్నామన్నారు. ఇక్క‌ 8 రకాల వ్యాధులకు సంబందించిన ట్రీట్ మెంట్ తీసుకోవ‌చ్చ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని,
రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెంచుతామ‌న్నారు. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తాన‌న్నారు. పెద్దపెద్ద ఆసుపత్రుల్లో అందె అన్ని చికిత్సలు ఇక్కడ లభిస్తాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement