Wednesday, May 8, 2024

ఢిల్లీ నుంచి దోహా వెళ్లే ఖతార్‌ విమానంలో పొగలు..

ఢిల్ల నుంచి దోహాకు బయల్దేరిన ఖతార్‌ విమానంలో పొగలు వ్యాపించాయి. దీంతో అత్యవసరంగా దారిమళ్లించి, కరాచీలో ల్యాండింగ్‌ చేయించారు. ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యుఆర్‌ 579 విమానం సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు 100 మందికిపైగా ప్రయాణికులతో ఢిల్లిd నుంచి దోహాకు బయల్దేరింది. కొద్దిసేపటికో కార్గోలో పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే విమానాన్ని దారిమళ్లించారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 2 గంటల తర్వాత విమానాన్ని పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో 5.30 గంటలకు దించారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిందని, ప్రయాణికులందరిని సురక్షితంగా బయటకు పంపామని, ఘటనపై విచారణ జరుపుతున్నామని ఖతార్‌ ఏవియేషన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులను వేరొక విమానంలో గమ్యస్థానం చేర్చుతామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement