Saturday, April 27, 2024

సోద‌రి పెళ్ళిలో ర‌చ్చ ర‌చ్చ చేసిన.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి

న‌టి ప్ర‌గ‌తి ఈ మ‌ధ్య‌కాలంలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. జిమ్ లో వ‌ర్క్ వుట్స్ ద‌గ్గ‌ర నుంచి త‌న‌కి సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. కాగా తన సోదరి మ్యారేజ్ లో నటి ప్రగతి ఎంజాయ్ చేసిన విధానం నేటిజన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది.ఓ వ్యక్తి బ్యాండ్ కొడుతూ ఉండగా.. దానిపైన ఎక్కేసింది ప్రగతి . అక్కడితో ఆగకుండా డ్యాన్స్ కూడా చేసింది. అయితే వెనకాల ఆ వ్యక్తి మాత్రం మోయలేక ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా సిస్టర్ మ్యారేజ్ లో ఆమె కంట్రోల్ లేని విధంగా ఎంజాయ్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రగతి ఇంతకుముందు కూడా కొన్ని డ్యాన్స్ వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.ఆమె విడియోలలో ఒకవైపు డాన్స్ టాలెంట్ తో పాటు మరొకవైపు తన గ్లామర్ ను కూడా హైలెట్ చేసుకుంటూ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement